Skip to content
Opens in a new window

[1] యెహోవా పరిపాలన చేస్తున్నాడు. వైభవం ఆయన ధరించిన వస్త్రం. బలం నడికట్టుగా యెహోవా ధరించుకొన్నాడు. భూమి దాని స్థానంలో సుస్థిరంగా ఉంది.

[2] మొదటినుంచి నీ సింహాసనం సుస్థిరంగా ఉంది. కాలం ఉనికిలోకి రాకముందే నీవు ఉన్నావు.

[3] యెహోవా! వరదలు గొంతెత్తాయి, వరదలు గొంతెత్తి ఘోషించాయి. వరదలు హోరుమంటూ తమ అలలెత్తుతున్నాయి.

[4] అనేక జనాల ఘోషను మించి, మహా సముద్ర తరంగాలను మించి, యెహోవా ఆకాశవీధిలో శక్తిమంతుడు.

[5] యెహోవా, నీ శాసనాలు ఎన్నడూ తప్పనివి. నిత్యమూ నీ ఆలయానికి యుక్తమైనది పవిత్రతే.

కీర్తనలు — Chapters