[1] “యెహోవా ఆలయానికి వెళ్దాం రండి” అని ప్రజలు నాతో చెప్పినప్పుడు నేను సంతోషించాను.
[2] జెరుసలం! నీ ద్వారాల లోపల మా పాదాలు మోపి నిలిచి ఉన్నాం.
[3] జెరుసలం ఒక భాగంతో ఒకటి చక్కగా కుదిరిన నిర్మాణమైన నగరం.
[4] యెహోవా పేరుకు కృతజ్ఞత అర్పించడానికి యెహోవా గోత్రాలు అక్కడికి ఎక్కిపోతాయి. ఇది ఇస్రాయేల్‌ప్రజలకు ఇచ్చిన శాసనం.
[5] న్యాయం తీర్చడానికి సింహాసనాలను స్థాపించడం అక్కడే జరిగింది. అవి దావీదు రాజవంశం సింహాసనాలు.
[6] జెరుసలం శాంతికోసం ప్రార్థన చేయండి. జెరుసలం! నిన్ను ప్రేమించేవారికి వృద్ధి!
[7] నీ ప్రాకారాలలో శాంతి ఉంటుంది గాక! నీ నగరులలో అభివృద్ధి ఉంటుంది గాక!
[8] నా సోదరుల కోసం, నా మిత్రుల కోసం “నీలో శాంతి ఉంటుంది గాక”! అంటున్నాను.
[9] మన దేవుడైన యెహోవా ఆలయంకోసం నీకు మేలు చేయడానికి విశ్వప్రయత్నం చేస్తాను.
కీర్తనలు — Chapters
123456789101112131415161718192021222324252627282930313233343536373839404142434445464748495051525354555657585960616263646566676869707172737475767778798081828384858687888990919293949596979899100101102103104105106107108109110111112113114115116117118119120121122123124125126127128129130131132133134135136137138139140141142143144145146147148149150