Skip to content
Opens in a new window

[1] దేవా, నన్ను విడిపించడానికి త్వరగా రా! యెహోవా, నాకు వెంటనే సహాయం చెయ్యి!

[2] నా ప్రాణం తీసుకొనేందుకు వెదికేవాళ్ళు ఆశాభంగం పొంది సిగ్గుపడతారు గాక! నాకు కీడు కలిగితే సంతోషించేవాళ్ళు అవమానంతో వెనక్కు ఒరుగుతారు గాక!

[3] “ఇహిహీ” అంటూ వేళాకోళం చేసేవాళ్ళు తమ అవమానానికి ప్రతిఫలంగా వెనక్కు తిరిగిపోతారు గాక!

[4] కాని, నిన్ను వెదికేవారంతా సంతోషిస్తూ ఆనందిస్తూ ఉంటారు గాక! నీవిచ్చే రక్షణను ప్రేమించేవారు “దేవుని కీర్తి అధికం కావాలి!” అంటూ ఎల్లప్పుడూ చెప్పుకొంటారు గాక!

[5] నేను బాధల పాలవుతున్నాను, దీనదశలో ఉన్నాను. దేవా, నా దగ్గరికి త్వరగా రా! నీవే నా సహాయం. నీవే నా రక్షకుడవు యెహోవా, ఆలస్యం చెయ్యకు!

కీర్తనలు — Chapters