[1] యెహోవా, నాకు విరోధులెందరో ఉన్నారు! నాకు వ్యతిరేకంగా నిలబడేవాళ్ళెందరో!
[2] “దేవుని మూలంగా అతడికేమీ రక్షణ దొరకదు” అంటూ అనేక మంది నా గురించి అంటున్నారు. (సెలా)
[3] కాని, యెహోవా! నీవు నాకు డాలులాంటివాడవు. నీవే నాకు ఘనత. నేను తలెత్తుకొనేలా చేసేవాడవు నీవే.
[4] నేను గొంతెత్తి యెహోవాకు మొర పెట్టేటప్పుడు ఆయన తన పవిత్ర పర్వతం నుంచి జవాబిస్తాడు. (సెలా)
[5] యెహోవా నాకు అండగా ఉండడం చేత నేను పడుకొన్నాను, నిద్రపోయి లేచాను.
[6] వేలాది వేలమంది శత్రువులు వచ్చి నన్ను చుట్టుముట్టారు గానీ నాకేమీ భయం లేదు.
[7] యెహోవా, లే! నా దేవా! నన్ను రక్షించు. నీవు నా శత్రువులందరి దవడ ఎముక విరగకొట్టేవాడవు. దుర్మార్గుల పళ్ళు రాలగొట్టేవాడవు.
[8] రక్షించేది యెహోవాయే, నీ ప్రజమీద నీ ఆశీస్సులు ఉంటాయి గాక! (సెలా)
కీర్తనలు — Chapters
123456789101112131415161718192021222324252627282930313233343536373839404142434445464748495051525354555657585960616263646566676869707172737475767778798081828384858687888990919293949596979899100101102103104105106107108109110111112113114115116117118119120121122123124125126127128129130131132133134135136137138139140141142143144145146147148149150