Skip to content
Opens in a new window

[1] యెహోవా, అతి లోతైన స్థలాల్లో ఉండి నేను నిన్ను ప్రాధేయపడుతున్నాను.

[2] ప్రభూ! నా ప్రార్థన విను. నా విన్నపాలు నీ చెవిని బెట్టు.

[3] యెహోవా, నీవు అపరాధాలు కనిపెట్టి చూస్తే, ప్రభూ! ఎవరు నిలవగలరు?

[4] అయితే క్షమాపణ నీ దగ్గర దొరుకుతుంది. తద్వారా నీమీద భయభక్తులు కలగాలని నీ ఆశయం.

[5] యెహోవా కోసం నేను ఎదురు చూస్తున్నాను. నా ప్రాణం ఆయనకోసం ఎదురు చూస్తూ ఉంది. ఆయన మాటమీదే నా ఆశాభావం.

[6] కావలివాళ్ళు ఉదయం ఎప్పుడు వస్తుందా అని చూస్తారు. అంతకంటే ఎక్కువగా నా ప్రాణం ప్రభువుకోసం ఎదురు చూస్తూ ఉంది.

[7] ఇస్రాయేల్‌ప్రజలారా, యెహోవామీద ఆశాభావం ఉంచుకోండి. యెహోవా దగ్గర అనుగ్రహం లభిస్తుంది. ఆయన దగ్గర విముక్తి సమృద్ధిగా దొరుకుతుంది.

[8] ఇస్రాయేల్‌వంశానికి దాని అపరాధాలన్నిటినుంచీ ఆయన విడుదల ప్రసాదిస్తాడు.

కీర్తనలు — Chapters