[1] పవిత్ర పర్వతాల పై ఆయన తన పునాది వేశాడు.
[2] యాకోబు వంశీయులు నివసించే స్థలాలన్నిటికంటే సీయోను ద్వారాలు యెహోవాకు ప్రీతి పాత్రమైనవి.
[3] దేవుని నగరమా, నీ గురించి చాలా గొప్ప విషయాలు, చెప్పి ఉన్నాయి. (సెలా)
[4] “రాహాబు, బబులోను నన్ను ఎరిగిన జనాలలో ఉన్నాయని తెలియజేస్తాను. ఇవిగో ఫిలిష్తీయ, తూరు, కూషు వీటిలో ఒక్కొక్క దాని గురించి కూడా ఇది సీయోనులో పుట్టినది అంటారు.”
[5] సీయోను గురించి ఇలా కబుర్లాడుకొంటారు: “ఆ జనం, ఈ జనం అందులో జన్మించాయి. సర్వాతీతుడు దానిని సుస్థిరం చేస్తాడు.”
[6] యెహోవా జనాలను నమోదు చేయిస్తూ ఇలా అంటాడు: “ఈ జనం సీయోనులో జన్మించింది.” (సెలా)
[7] గాయకులు, వాయిద్యగాండ్లు “మా ఊటలన్నీ నీలోనే ఉన్నాయి” అంటూ సంకీర్తనం చేస్తారు.
కీర్తనలు — Chapters
123456789101112131415161718192021222324252627282930313233343536373839404142434445464748495051525354555657585960616263646566676869707172737475767778798081828384858687888990919293949596979899100101102103104105106107108109110111112113114115116117118119120121122123124125126127128129130131132133134135136137138139140141142143144145146147148149150