[1] యెహోవా, ఎన్నాళ్ళు నన్ను నీవు మరచిపోతావు? ఎల్లకాలమా? ఎన్నాళ్ళు నాకు నీ ముఖం కనబడకుండా చేస్తావు?
[2] ఎంతకాలమని నా తలంపుల వల్ల ఈ బాధ? ఎంతవరకు నా హృదయంలో ప్రతి రోజూ ఈ శోకం ఉంటుంది? శత్రువులు ఎంతవరకు నా మీద రెచ్చిపోతారు?
[3] యెహోవా, నా దేవా! నావైపు చూడు! నేనడిగిన దానికి జవాబియ్యి! నా కన్నులకు వెలుగు ప్రసాదించు! లేకపోతే అది నాకు మృత్యు నిద్ర అవుతుందన్న మాటే!
[4] అప్పుడు నా శత్రువు తానే గెలిచినట్టు చెప్పుకుంటాడు. నేను పడిపోతే నా పతనానికి నా పగవాళ్ళు సంతోషంతో ఉప్పొంగిపోతారు.
[5] నేనైతే నీ అనుగ్రహం మీద నమ్మకం ఉంచాను. నీ రక్షణలో నా హృదయం ఆనందిస్తుంది.
[6] యెహోవా నాకు మేలు చేశాడు. గనుక నేను ఆయనకు సంకీర్తనం చేస్తాను.
కీర్తనలు — Chapters
123456789101112131415161718192021222324252627282930313233343536373839404142434445464748495051525354555657585960616263646566676869707172737475767778798081828384858687888990919293949596979899100101102103104105106107108109110111112113114115116117118119120121122123124125126127128129130131132133134135136137138139140141142143144145146147148149150