Skip to content
Opens in a new window

[1] సర్వలోక ప్రజలారా, యెహోవాకు ఆనంద ధ్వనులు చేయండి!

[2] సంతోషంతో యెహోవాకు సేవ చేయండి! ఆనందగీతం పాడుతూ ఆయన సన్నిధానంలోకి రండి!

[3] యెహోవాయే దేవుడని తెలుసుకోండి! ఆయన మనల్ని నిర్మించాడు. మనం ఆయన మనుషులం. మనం ఆయనకు చెందిన ప్రజలం, ఆయన మేపే గొర్రెలం.

[4] కృతజ్ఞతతో ఆయన ద్వారాలగుండా ప్రవేశించండి. స్తుతులతో ఆయన ఆవరణాలలోకి రండి. ఆయనకు కృతజ్ఞత అర్పించండి. ఆయన పేరును కీర్తించండి.

[5] యెహోవా మంచివాడు. ఆయన అనుగ్రహం శాశ్వతంగా ఉంటుంది. ఆయన విశ్వసనీయత తరతరాలకు ఉంటుంది.

కీర్తనలు — Chapters