[1] యెహోవా సీయోను నగరవాసులను చెరనుంచి తిరిగి తెచ్చినప్పుడు మనం కల కంటున్నామా అనిపించింది.
[2] మన నోరు నవ్వులతో నిండిపోయింది. మన నాలుక ఆనంద ధ్వనులు చేసింది. అప్పుడు ఇతర జనాలు ఇలా చెప్పుకొన్నారు: “యెహోవా వీళ్ళకోసం గొప్ప క్రియలు చేశాడు.”
[3] నిజంగా యెహోవా మనకోసం గొప్ప క్రియలు చేశాడు. మనం ఆనందభరితులం.
[4] దక్షిణ ప్రదేశాల ప్రవాహాలు పారినట్లు, యెహోవా, మమ్మల్ని చెరనుంచి తిరిగి రప్పించు.
[5] కన్నీళ్ళు విడుస్తూ విత్తనాలు చల్లేవారు ఆనంద ధ్వనులు చేస్తూ పంట కోస్తారు.
[6] విత్తనాలు చేతపట్టుకొని ఏడుస్తూ అటూ ఇటూ వెళ్తూ ఉండేవాడు ఆనంద ధ్వనులతో వచ్చితీరుతాడు. తన పనలను మోసుకొని తిరిగి వస్తాడు.
కీర్తనలు — Chapters
123456789101112131415161718192021222324252627282930313233343536373839404142434445464748495051525354555657585960616263646566676869707172737475767778798081828384858687888990919293949596979899100101102103104105106107108109110111112113114115116117118119120121122123124125126127128129130131132133134135136137138139140141142143144145146147148149150