Skip to content
Opens in a new window

[1] ఈజిప్ట్‌నుంచి ఇస్రాయేల్‌ప్రజ వచ్చినప్పుడు, యాకోబువంశం పర భాష మాట్లాడే జనం దగ్గర నుంచి వచ్చినప్పుడు,

[2] దేవునికి యూదా పవిత్ర స్థలమైంది. ఇస్రాయేల్ ఆయన రాజ్యమైంది.

[3] సముద్రం ఇది చూచి పారిపోయింది. యొర్దాను వెనక్కు తిరిగింది.

[4] పర్వతాలు పొట్టేళ్ళలాగా గంతులు వేశాయి. కొండలు గొర్రెపిల్లల్లాగా గంతులు పెట్టాయి.

[5] ఓ సముద్రమా! నీకేం వచ్చిందని ఇలా పారిపోయావు? యొర్దాను! నీకేం వచ్చిందే ఇలా వెనక్కు తిరిగావు?

[6] పర్వతాల్లారా! మీరు పొట్టేళ్లలాగా గంతులు వేయడానికి మీకేం వచ్చింది? కొండల్లారా! మీరు గొర్రెపిల్లలాగా గంతులు పెట్టడానికి మీకేం వచ్చిందేమిటి?

[7] ఓ భూతలమా! ప్రభు సన్నిధానంలో, యాకోబుయొక్క దేవుని సన్నిధానంలో గడగడ వణకు!

[8] ఆయన బండను నీళ్ళ గుంటగా మార్చేవాడు, చెకుముకి బండను నీటి ఊటగా మార్చేవాడు.

కీర్తనలు — Chapters