Skip to content
Opens in a new window

[1] కొండల వైపు నా తలెత్తి చూస్తాను. ఎక్కడ నుంచి నాకు సహాయం వస్తుంది?

[2] ఆకాశాలనూ, భూమినీ సృజించిన యెహోవా నుంచే నాకు సహాయం వస్తుంది.

[3] ఆయన నిన్ను తప్పటడుగు వెయ్యనియ్యడు. నిన్ను కాపాడేవాడు కునికేవాడు కాడు.

[4] ఇస్రాయేల్‌ప్రజను కాపాడేవాడు కునుకడు, నిద్రపోడు.

[5] నిన్ను కాపాడేవాడు యెహోవాయే. నీ కుడిప్రక్కన యెహోవా నీకు తోడునీడ.

[6] పగలు ఎండవడ నీకు కొట్టదు. రాత్రి వెన్నెల దెబ్బ నీకు తగలదు.

[7] నీవు ఏ ప్రమాదంలోనూ చిక్కుకోకుండా యెహోవా నిన్ను కాపాడుతాడు. ఆయన నీ ప్రాణాన్ని కాపాడుతాడు.

[8] ఇప్పటినుంచీ ఎప్పటికీ నీ రాకపోకల్లో యెహోవా నిన్ను కాపాడుతాడు.

కీర్తనలు — Chapters