[1] యెహోవా మంచివాడు. ఆయనకు కృతజ్ఞతలు అర్పించండి. ఆయన అనుగ్రహం ఎప్పటికీ ఉంటుంది.
[2] దేవాది దేవునికి కృతజ్ఞతలు అర్పించండి. ఆయన అనుగ్రహం ఎప్పటికీ ఉంటుంది.
[3] ప్రభువుల ప్రభువుకు కృతజ్ఞతలు అర్పించండి. ఆయన అనుగ్రహం ఎప్పటికీ ఉంటుంది.
[4] గొప్ప అద్భుతాలు చేయగలవాడు ఆయన ఒక్కడే. ఆయన అనుగ్రహం ఎప్పటికీ ఉంటుంది.
[5] తన జ్ఞానాన్ని అనుసరించి ఆయన ఆకాశాలను చేశాడు. ఆయన అనుగ్రహం ఎప్పటికీ ఉంటుంది.
[6] ఆయన భూమిని నీళ్ళమీద పరిచాడు. ఆయన అనుగ్రహం ఎప్పటికీ ఉంటుంది.
[7] ఆయన మహా జ్యోతులను నిర్మాణం చేశాడు. ఆయన అనుగ్రహం ఎప్పటికీ ఉంటుంది.
[8] పగటిని పరిపాలించడానికి ఆయన సూర్య మండలాన్ని చేశాడు. ఆయన అనుగ్రహం ఎప్పటికీ ఉంటుంది.
[9] రాత్రిని పరిపాలించడానికి ఆయన చంద్రగోళాన్ని, నక్షత్రాలను నిర్మించాడు. ఆయన అనుగ్రహం ఎప్పటికీ ఉంటుంది.
[10] ఈజిప్ట్‌వాళ్ళ తొలిచూలునంతా ఆయన హతం చేశాడు. ఆయన అనుగ్రహం ఎప్పటికీ ఉంటుంది.
[11] వాళ్ళమధ్య నుంచి ఇస్రాయేల్‌ప్రజలను ఆయన తీసుకువచ్చాడు. ఆయన అనుగ్రహం ఎప్పటికీ ఉంటుంది.
[12] చెయ్యి చాచి తన భుజ బలంతో వారిని తీసుకువచ్చాడు. ఆయన అనుగ్రహం ఎప్పటికీ ఉంటుంది.
[13] ఎర్ర సముద్రాన్ని ఆయన పాయలుగా చీల్చాడు. ఆయన అనుగ్రహం ఎప్పటికీ ఉంటుంది.
[14] ఆయన ఇస్రాయేల్‌ప్రజలను దానిమధ్యగుండా దాటించాడు. ఆయన అనుగ్రహం ఎప్పటికీ ఉంటుంది.
[15] ఫరోను, అతడి సైన్యాన్ని ఎర్ర సముద్రంలో ఆయన ముంచివేశాడు. ఆయన అనుగ్రహం ఎప్పటికీ ఉంటుంది.
[16] ఎడారిలో ఆయన తన ప్రజలను నడిపించాడు. ఆయన అనుగ్రహం ఎప్పటికీ ఉంటుంది.
[17] మహా రాజులను ఆయన కూలగొట్టాడు. ఆయన అనుగ్రహం ఎప్పటికీ ఉంటుంది.
[18] ప్రసిద్ధులైన రాజులను ఆయన సంహరించాడు. ఆయన అనుగ్రహం ఎప్పటికీ ఉంటుంది.
[19] అమోరీవాళ్ళ రాజు సీహోనును ఆయన సంహరించాడు. ఆయన అనుగ్రహం ఎప్పటికీ ఉంటుంది.
[20] బాషాను రాజు ఓగును ఆయన సంహరించాడు. ఆయన అనుగ్రహం ఎప్పటికీ ఉంటుంది.
[21] ఆయన వాళ్ళ ప్రాంతాలను వారసత్వంగా ఇచ్చాడు. ఆయన అనుగ్రహం ఎప్పటికీ ఉంటుంది.
[22] తన సేవకుడైన ఇస్రాయేల్‌వంశానికి దానిని వారసత్వంగా ఇచ్చాడు. ఆయన అనుగ్రహం ఎప్పటికీ ఉంటుంది.
[23] మనం దీనదశలో ఉన్నప్పుడాయన మనల్ని జ్ఞాపకం ఉంచుకొన్నాడు. ఆయన అనుగ్రహం ఎప్పటికీ ఉంటుంది.
[24] మన శత్రువుల బారినుంచి మనల్ని విడిపించాడు. ఆయన అనుగ్రహం ఎప్పటికీ ఉంటుంది.
[25] సమస్త ప్రాణికోటికీ ఆయన ఆహారం ఇస్తున్నాడు. ఆయన అనుగ్రహం ఎప్పటికీ ఉంటుంది.
[26] పరలోక దేవునికి కృతజ్ఞతలు అర్పించండి. ఆయన అనుగ్రహం ఎప్పటికీ ఉంటుంది.