Skip to content
Opens in a new window

[1] యెహోవాను స్తుతించండి! నిజాయితీపరుల సభలో, సమాజంలో నేను హృదయపూర్వకంగా యెహోవాకు కృతజ్ఞతలు చెప్పుకొంటాను.

[2] యెహోవా చేసే పనులు గొప్పవి. అవంటే ఇష్టమున్నవారంతా వాటిని గ్రహించడానికి ప్రయత్నిస్తారు.

[3] ఆయన క్రియ ఘనమైనది, దివ్యమైనది. ఆయన న్యాయం శాశ్వతంగా నిలిచి ఉంటుంది.

[4] తాను చేసిన అద్భుతాలు మనుషుల జ్ఞాపకంలో ఉండేలా చేశాడాయన. ఆయన దయామయుడు, వాత్సల్యమూర్తి.

[5] తనమీద భయభక్తులు గలవారికి ఆహారం పెడతాడు. ఎల్లప్పుడూ తన ఒడంబడికను జ్ఞాపకం ఉంచుకొంటాడు.

[6] తన ప్రజలకు ఇతర జనాల వారసత్వాన్ని అనుగ్రహించాడు. తద్వారా తన క్రియలలోని బలప్రభావాలను వారికి వెల్లడి చేశాడు.

[7] ఆయన స్వయంగా చేసిన పనులన్నీ సత్యం, సవ్యం. ఆయన నియమాలన్నీ నమ్మకమైనవి.

[8] అవి నిరంతరమూ సుస్థిరంగా ఉంటాయి. సత్యంతో, నిజాయితీతో నియమించబడినవి అవి.

[9] తన ప్రజలకు విడుదల ప్రసాదించాడాయన. తన ఒడంబడికను శాశ్వతంగా నిలిచి ఉండాలని నిర్ణయించాడు. ఆయన పేరు పవిత్రం, భయభక్తులు గొలిపేది.

[10] యెహోవా మీది భయభక్తులు జ్ఞానానికి ఆరంభం. ఆయన నియమాల ప్రకారం ప్రవర్తించేవారందరూ మంచి తెలివితేటలు గలవారు. ఆయన గురించిన సంస్తుతి ఎప్పటికీ ఉంటుంది.

కీర్తనలు — Chapters