Skip to content
Opens in a new window

[1] దేవా, నీ పేరును బట్టి నన్ను రక్షించు! నీ బలాన్ని పురస్కరించుకొని నాకు న్యాయం చేకూర్చు!

[2] దేవా, నా ప్రార్థన వినిపించుకో! నా నోట వెలువడే మాటలు ఆలకించు!

[3] పరాయివాళ్ళు నామీదికి ఎగబడుతున్నారు, దౌర్జన్యపరులు నా ప్రాణం తీయజూస్తున్నారు. దేవుడంటే వాళ్ళకు లెక్కలేదు. (సెలా)

[4] ఇదిగో! నాకు సహాయం దేవుడే! నా ఆత్మను ఆదరించేవాడు ప్రభువే!

[5] నా శత్రుమూక తల పెట్టే కీడు వాళ్ళనే బెడిసికొట్టేలా చేస్తాడు. నీ సత్యం దృష్ట్యా వారిని నాశనం చెయ్యి!

[6] స్వేచ్ఛగా నేను నీకు బలులు అర్పిస్తాను. యెహోవా! నీ పేరు శ్రేష్ఠమైనది గనుక దానిని స్తుతిస్తాను.

[7] బాధలన్నిటినుంచి ఆయన నన్ను తప్పించాడు. నా పగవాళ్ళకు పట్టిన గతి నాకు కన్నుల పండుగ!

కీర్తనలు — Chapters