[1] యెహోవా అంటే భయభక్తులు కలిగి, ఆయన విధానాలను అనుసరించి నడిచేవారందరూ ధన్యజీవులు.
[2] నీవు కష్టించి సంపాదించుకొన్న ఆహారాన్ని తింటూ సంతోషిస్తావు. నీవు క్షేమంగా ఉంటావు.
[3] నీ ఇంట్లో నీ భార్య ఫలవంతమైన ద్రాక్షచెట్టులాగా ఉంటుంది. నీ భోజనం బల్ల చుట్టూరా నీ పిల్లలు ఆలీవ్‌మొక్కల్లాగా ఉంటారు.
[4] యెహోవా అంటే భయభక్తులున్న వాడికి ఈ విధంగా ఆశీస్సులు కలుగుతాయి.
[5] సీయోనులో నుంచి యెహోవా నిన్ను దీవిస్తాడు గాక! నీవు బ్రతికినన్నాళ్ళూ జెరుసలం అభివృద్ధి చూస్తూ ఉంటావు గాక!
[6] నీ మనుమలను చూచేవరకు బ్రతుకుతావు గాక! ఇస్రాయేల్‌ప్రజల మీద శాంతి!
కీర్తనలు — Chapters
123456789101112131415161718192021222324252627282930313233343536373839404142434445464748495051525354555657585960616263646566676869707172737475767778798081828384858687888990919293949596979899100101102103104105106107108109110111112113114115116117118119120121122123124125126127128129130131132133134135136137138139140141142143144145146147148149150