Skip to content
Opens in a new window

[1] కష్ట సమయంలో యెహోవా నీకు జవాబిస్తాడు గాక! యాకోబు యొక్క దేవుని పేరు నిన్ను కాపాడుతుంది గాక!

[2] తన పవిత్రాలయంనుంచి ఆయన నీకు సహాయం చేస్తాడు గాక! సీయోను నుంచి ఆయన నీకు అండదండగా ఉంటాడు గాక!

[3] నీ నైవేద్యాలన్నీ ఆయన జ్ఞాపకం ఉంచుకుంటాడు గాక! నీ హోమ బలులు ఆయన స్వీకరిస్తాడు గాక! (సెలా)

[4] నీ కోరికలు ఆయన సఫలం చేస్తాడు గాక! నీ ఆలోచనలన్నీ నెరవేరేలా చేస్తాడు గాక!

[5] నీ విజయానికి మేము ఆనంద ధ్వనులు చేస్తాం. మా దేవుని పేర పతాకం ఎత్తుతాం. నీ మనవులన్నీ యెహోవా అనుగ్రహిస్తాడు గాక!

[6] యెహోవా తన అభిషిక్తుణ్ణి కాపాడుతాడు. ఇప్పుడిది నాకు తెలుసు. ఆయన తన పవిత్ర లోకంనుంచి అతడికి జవాబిస్తాడు, విజయవంతమైన కుడిచేతి బలం ప్రయోగిస్తాడు.

[7] కొందరు తమ రథాలను చూచుకొని గర్విస్తారు. కొందరు గుర్రాలను చూచుకొని మురిసిపోతారు. కాని, మనం మన దేవుడు యెహోవా పేరటే ఉప్పొంగుతాం.

[8] అలాంటివాళ్ళు వంగి కుప్పకూలిపోతారు. కాని, మనం చక్కగా లేచి నిలుచున్నాం.

[9] యెహోవా, కాపాడు! మేము ప్రార్థన చేసేటప్పుడు రాజువైన నీవు ఆలకిస్తావు గాక!

కీర్తనలు — Chapters