[1] దేవుడు మమ్మల్ని దయ చూపి దీవిస్తాడు గాక! తన ముఖకాంతి మామీద ప్రకాశించేలా చేస్తాడు గాక! (సెలా)
[2] భూమిమీద నీ మార్గం వెల్లడి అవుతుంది గాక! సర్వ లోక ప్రజలు నీ విముక్తి తెలుసుకొంటారు గాక!
[3] దేవా! ప్రజలు నిన్ను స్తుతిస్తారు గాక! ప్రజలంతా నిన్ను స్తుతిస్తారు గాక!
[4] న్యాయంతో నీవు జనాలకు తీర్పు తీరుస్తావు. లోక జనాలను పరిపాలన చేస్తావు. జనాలు సంతోషించి ఆనంద ధ్వనులు చేస్తారు గాక! (సెలా)
[5] దేవా! ప్రజలు నిన్ను స్తుతిస్తారు గాక! ప్రజలంతా నిన్ను స్తుతిస్తారు గాక!
[6] అప్పుడు భూమి దాని ఫలం ఇస్తుంది, దేవుడు, మా దేవుడు మమ్మల్ని ఆశీర్వదిస్తాడు.
[7] దేవుడు మమ్మల్ని దీవిస్తాడు, భూమి కొనలన్నిటికి ఆయనపట్ల భయభక్తులు కలుగుతాయి.
కీర్తనలు — Chapters
123456789101112131415161718192021222324252627282930313233343536373839404142434445464748495051525354555657585960616263646566676869707172737475767778798081828384858687888990919293949596979899100101102103104105106107108109110111112113114115116117118119120121122123124125126127128129130131132133134135136137138139140141142143144145146147148149150