Skip to content
Opens in a new window

[1] యెహోవా, నీ గుడారంలో ఉండతగినవాడెవడు? నీ పవిత్ర పర్వతం మీద నివసించడానికి యోగ్యుడెవడు?

[2] హృదయ పూర్వకంగా సత్యం చెపుతూ, నిజాయితీ, సత్‌ప్రవర్తన గలవాడే.

[3] అలాంటివాడి నాలుక అపనిందలు ప్రచారం చెయ్యదు. అతడు తన పొరుగువాడికి కీడు జరిగించడు. ప్రక్క వాడిమీద అభాండాలు వెయ్యడు.

[4] నీచుడంటే అతడికి అసహ్యం గానీ యెహోవా అంటే భయభక్తులున్న వారిని అతడు గౌరవిస్తాడు. తనకు నష్టం వాటిల్లినా సరే, ఆడినమాట తప్పడు.

[5] డబ్బు అప్పిచ్చి వడ్డీ వసూలు చెయ్యడు. నిర్దోషులకు వ్యతిరేకంగా నిలబడడానికి లంచం తీసుకోడు. ఈ విధంగా ప్రవర్తించే వ్యక్తిని ఏదీ కదల్చదు.

కీర్తనలు — Chapters