[1] దుర్మార్గుల సలహాల ప్రకారం నడవకుండా, పాపాత్ముల జీవిత విధానంలో నిలవకుండా, పరిహాసకులుండే చోట కూర్చోకుండా,
[2] యెహోవా ఇచ్చిన ఉపదేశంలో ఆనందిస్తూ, దాన్ని రాత్రింబగళ్ళు ధ్యానం చేస్తూ ఉండేవారు ధన్యజీవులు.
[3] వారు పారుతూ ఉన్న కాలువలదగ్గర నాటి ఉన్న చెట్టువంటివారు, సరైన కాలానికి, కాపు కాస్తూ, ఆకులు వాడని చెట్టులాంటివారు. వారు చేసేదంతా సఫలమవుతుంది.
[4] కానీ, దుర్మార్గులు అలా కాదు. వాళ్ళు గాలికి కొట్టుకుపొయ్యే పొట్టులాంటివారు.
[5] గనుక వాళ్ళు దేవుని తీర్పుకు నిలవలేకపోతారు. పాపాత్ములు న్యాయవంతుల సభలో నిలవరు.
[6] న్యాయవంతుల జీవిత విధానం యెహోవాకు తెలుసు గానీ దుర్మార్గుల జీవిత విధానం పూర్తిగా నాశనం అవుతుంది.
కీర్తనలు — Chapters
123456789101112131415161718192021222324252627282930313233343536373839404142434445464748495051525354555657585960616263646566676869707172737475767778798081828384858687888990919293949596979899100101102103104105106107108109110111112113114115116117118119120121122123124125126127128129130131132133134135136137138139140141142143144145146147148149150