[1] యెహోవాను నమ్మి ఆశ్రయించాను. మీరు నన్ను చూచి “పక్షిలాగా నీ కొండమీదికి పారిపో!
[2] అరుగో, దుర్మార్గులు విల్లెక్కు పెట్టారు! దొంగచాటుగా యథార్థవంతుల మీద బాణం వెయ్యాలని ధనుస్సును సంధించారు!
[3] పునాదులు నాశనమవుతూ ఉంటే న్యాయవంతులు చేయగలిగినదేమిటి?” అని ఎలా అంటారో అనండి.
[4] యెహోవా తన పవిత్రాలయంలో ఉన్నాడు. యెహోవా సింహాసనం పరలోకంలో ఉంది. మనుషులను ఆయన చూస్తూ ఉన్నాడు. ఆయన చూపులు వాళ్ళను పరీక్షిస్తున్నాయి.
[5] యెహోవా న్యాయవంతులను పరీక్షిస్తాడు. దౌర్జన్యం అంటే ఇష్టమున్నవాళ్ళనూ, దుర్మార్గులనూ ఆయన ద్వేషిస్తాడు.
[6] దుర్మార్గుల మీద ఆయన నిప్పుకణాలు వర్షించేలా చేస్తాడు. అగ్ని గంధకాలు, వడగాలి వాళ్ళ పాన పాత్రలోని పదార్థాలు.
[7] యెహోవా న్యాయవంతుడు. ఆయనకు న్యాయమంటే ఎంతో ఇష్టం. యథార్థవంతులకు ఆయన ముఖ దర్శనం కలుగుతుంది.
కీర్తనలు — Chapters
123456789101112131415161718192021222324252627282930313233343536373839404142434445464748495051525354555657585960616263646566676869707172737475767778798081828384858687888990919293949596979899100101102103104105106107108109110111112113114115116117118119120121122123124125126127128129130131132133134135136137138139140141142143144145146147148149150