Skip to content
Opens in a new window

[1] యెహోవా ఇంటిని కట్టించకపోతే కట్టేవారి కృషి అంతా వృధా! యెహోవా పట్టణాన్ని కాపాడకపోతే కావలివాడు మేలుకొని ఉండడం వృధా!

[2] మీరు పొద్దున్నే లేచి, ఎంతో రాత్రి గతించేవరకు మేలుకొని ఉండడం, కష్టించి సంపాదించుకొన్న ఆహారం తినడం వ్యర్థమే. ఆయన తన ప్రియ ప్రజలకు నిద్ర అనుగ్రహిస్తాడు.

[3] పిల్లలు యెహోవా ప్రసాదించే వారసత్వం. సంతానం యెహోవా ఇచ్చే బహుమానం.

[4] యవ్వనకాలంలో పుట్టిన పిల్లలు బలవంతుడి చేతిలోని బాణాలవంటివారు.

[5] సంతానంతో తన అంబులపొది నింపుకొన్నవారు ధన్యజీవులు. గుమ్మం దగ్గర విరోధులతో వాదించేటప్పుడు అలాంటివారికి అవమానం కలగదు.

కీర్తనలు — Chapters