Skip to content
Opens in a new window

[1] యెహోవా, నా హృదయం విర్రవీగడం లేదు. నా కండ్లు నెత్తికెక్కలేదు. నాకు మించిన విషయాల జోలికి, గొప్పవాటి జోలికి నేను పోవడం లేదు.

[2] నా ప్రాణానికి నెమ్మది అలవరచుకొన్నాను. దానిని అదుపులో ఉంచుకొన్నాను. తల్లిపాలు విడిచిన పిల్ల తల్లిదగ్గర నిశ్చింతగా ఉన్నట్టు నా ప్రాణం నాలో ప్రశాంతంగా ఉంది.

[3] ఇస్రాయేల్‌ప్రజలారా, ఇప్పటినుంచీ ఎప్పటికీ మీరు యెహోవాలోనే ఆశాభావాన్ని ఉంచుకోండి.

కీర్తనలు — Chapters