Skip to content
Opens in a new window

[1] నాకు న్యాయం చేకూర్చు, దేవా! భక్తిలేని ఈ ప్రజతో నా పక్షంగా వాదించు. మోసం, దౌర్జన్యం చేసేవారి నుంచి నన్ను విడిపించు.

[2] నీవే నా బలానివి. నా దేవుడవు. నన్ను ఎందుకిలా నిరాకరించావు? శత్రువులు నన్ను అణగదొక్కుతూ ఉంటే శోకమూర్తినై నేనెందుకు ఇలా వెళ్ళాలి?

[3] నీ వెలుగు, నీ సత్యం పంపించు. అవే నాకు దారి చూపుతూ నీ పవిత్ర పర్వతానికీ నీ ఆలయానికీ నన్ను చేరుస్తాయి.

[4] అప్పుడు నేను దేవుని బలిపీఠాన్ని సమీపిస్తాను. నా దేవుని దగ్గరికి వెళ్తాను. ఆయనే నాకు అధిక సంతోషం. దేవా! నా దేవా! తంతివాద్యం వాయిస్తూ, నిన్ను స్తుతిస్తాను.

[5] మనసా, నీవెందుకు ఇలా కుంగిపోతావు? నాలో నీవెందుకు ఇలా ఘోషిస్తావు? దేవునిమీద ఆశాభావం ఉంచు. ఆయనే నా రక్షణ, నా దేవుడు. ఇంకా ఆయనను స్తుతిస్తాను.

కీర్తనలు — Chapters