Skip to content
Opens in a new window

[1] నేను కృపను, న్యాయాన్ని గురించి పాడుతాను. యెహోవా, నిన్ను ఉద్దేశించి గీతం ఆలపిస్తాను.

[2] లోపం లేని విధానంలో జ్ఞానంతో ప్రవర్తిస్తాను. నీవెప్పుడు నా దగ్గరికి వస్తావు? నేను ఆంతర్యంలో నిజాయితీ పరుడనై నా ఇంటిలో మసులుకొంటాను.

[3] వ్యర్థమైన వాటిని నా కండ్లకు కనబడనివ్వను. నీ మార్గం విడిచిపెట్టినవాళ్ళ క్రియలంటే నాకు అసహ్యం. అవి నన్ను అంటకుండా చూచుకుంటాను.

[4] కుటిల హృదయం నాకు దూరమవుతుంది. దుర్మార్గాన్ని నేను అనుసరించను.

[5] పొరుగువాణ్ణి చాటుగా అపనిందలకు గురిచేసే వాళ్ళను నేను హతం చేస్తాను. మిడిసిపడే వాళ్ళను, గర్విష్ఠి హృదయులను నేను సహించను.

[6] దేశంలో నమ్మకమైనవారు నా చుట్టూరా ఉండాలని వారిమీదే నా దృష్టి ఉంటుంది. లోపం లేని విధానంలో ప్రవర్తించే వాళ్ళే నాకు సేవ చేస్తారు.

[7] మోసం అభ్యసించేవాళ్ళు నా భవనంలో ఉండడానికి వీల్లేదు. అబద్ధాలాడేవాడు నా కళ్ళ ఎదుట నిలవడానికి వీల్లేదు.

[8] ప్రతి ఉదయమూ దేశంలోని దుర్మార్గులందరినీ నేను హతమారుస్తాను. యెహోవా నగరంలో పాపాత్ములందరినీ లేకుండా చేస్తాను.

కీర్తనలు — Chapters