Skip to content
Opens in a new window

[1] యెహోవామీద నమ్మకం ఉంచేవారు సీయోను పర్వతంలాగా ఉంటారు. అది నిశ్చలం. అది ఎప్పటికీ నిలిచి ఉంటుంది.

[2] జెరుసలం చుట్టూ పర్వతాలు ఆవరించి ఉన్నట్టు ఇప్పటినుంచి ఎప్పటికీ యెహోవా తన ప్రజలచుట్టూ ఆవరించి ఉంటాడు.

[3] న్యాయవంతుల వారసత్వంమీద దుర్మార్గుల రాజదండం నిలిచి ఉండదు. న్యాయవంతులు అక్రమం చేయడానికి చేతులు చాపకూడదని అందులో దేవుని ఆశయం.

[4] యెహోవా, మంచివారికి మంచిని జరిగించు. హృదయంలో నిజాయితీ గలవారికి మంచిని జరిగించు.

[5] చెడుగు చేసేవారిని యెహోవా పారదోలేటప్పుడు తమ కుటిల మార్గాలకు తొలగిపోయిన వారిని కూడా పారదోలుతాడు. ఇస్రాయేల్‌ప్రజ మీద శాంతి ఉంటుంది గాక!

కీర్తనలు — Chapters