Skip to content
Opens in a new window

[1] నా కాపరి యెహోవా. అందుచేత నాకు కొదువ అంటూ ఉండదు.

[2] ఆయన నన్ను పచ్చిక మైదానాలలో పడుకో బెట్టుచున్నాడు. ప్రశాంత జలాలదగ్గర నాకు దారి చూపుతూ ఉన్నాడు.

[3] నా ప్రాణానికి సేద తీరుస్తున్నాడు. తన పేరు ప్రతిష్ఠలకోసం నన్ను న్యాయ సమ్మతమైన మార్గాలలో నడిపిస్తూ ఉన్నాడు.

[4] చావు నీడ ఉన్న లోయలో నేను నడచినా ఏ కీడుకూ భయపడను. ఎందుకంటే నీవు నాతో ఉన్నావు. నీ దండం, నీ చేతికర్ర నాకు ఆదరణ కలిగిస్తాయి.

[5] పగవాళ్ళ ఎదుటే నాకు భోజనం వడ్డిస్తావు. నూనెతో నాకు తలంటిపోస్తావు. నా పాత్ర నిండి పొర్లిపారుతూ ఉంది.

[6] నా జీవిత కాలమంతా మేలూ అనుగ్రహమూ నన్ను వెన్నంటి వస్తాయి. యెహోవా గృహసీమలో నేను శాశ్వతంగా నివాసం చేస్తాను.

కీర్తనలు — Chapters