Skip to content
Opens in a new window

[1] “నా యవ్వనకాలం నుంచి చాలా సార్లు నా పగవాళ్ళు నన్ను బాధించారు” అని ఇస్రాయేల్‌ చెపుతూ ఉంది,

[2] “నా యవ్వనకాలం నుంచి చాలా సార్లు వాళ్ళు నన్ను బాధించారు. అయినా నన్ను ఓడించలేకపొయ్యారు.

[3] దున్నేవాళ్ళు నా వీపును దున్నారు. పొడుగైన చాళ్ళలాంటి గాయాలు చేశారు.”

[4] యెహోవా న్యాయవంతుడు. దుర్మార్గులు కట్టిన తాళ్ళను తెంచివేశాడాయన.

[5] సీయోను మీద పగపట్టిన వాళ్ళందరూ ఆశాభంగం, సిగ్గు పాలై వెనక్కు తిప్పబడుతారు గాక!

[6] వాళ్ళు ఇంటి కప్పుమీద ఉన్న గడ్డిలాగా ఉంటారు గాక! పెరిగేముందే అది వాడిపోతుంది.

[7] కోసేవాడి గుప్పిలి దానితో నిండదు. కంకులు కోసేవాడి ఒడి నిండదు.

[8] దారిన పొయ్యేవారు వాళ్ళను చూచి, “యెహోవా ఆశీస్సులు మీ మీద ఉంటాయి గాక! యెహోవా పేర మిమ్మల్ని దీవిస్తున్నాం” అని చెప్పరు.

కీర్తనలు — Chapters