Skip to content
Opens in a new window

[1] యెహోవా! సహాయం చెయ్యి! భక్తిపరులు లేకుండా పొయ్యారు. మనుషులలో విశ్వసనీయులు కనబడకుండా పొయ్యారు.

[2] అందరూ ప్రక్కవాళ్ళతో అబద్ధాలు చెప్తారు. పొగడ్తలు పెదవులమీద, మోసం మనసులో – ఇదీ వాళ్ళ మాటల ధోరణి.

[3] పొగిడే ప్రతి పెదవునూ, గొప్పలు చెప్పుకునే ప్రతి నాలుకనూ యెహోవా నాశనం చేస్తాడు.

[4] “మా మాటలతో మేము గెలుస్తాం. మా పెదవులు మావే. మాకు యజమాని ఎవడు?”– ఇదీ వాళ్ళ ఆలోచన.

[5] అయితే యెహోవా ఇలా అంటాడు: “దీనావస్థలో ఉన్నవారి బాధనూ, అక్కరలో ఉన్నవారి మూలుగునూ చూచి ఇప్పుడే లేస్తాను. రక్షణ కోసం తహతహలాడుతున్న వారిని రక్షిస్తాను.”

[6] యెహోవా వాక్కులు శుద్ధమైనవి. మట్టి మూసలో ఏడుసార్లు బాగా పుటం పెట్టి శుద్ధి చేసిన వెండిలాంటివి.

[7] యెహోవా, నీవు వారిని రక్షిస్తావు. ఈ తరం వారినుంచి ఎల్లకాలం కాపాడుతావు.

[8] నీచత్వం పెచ్చు పెరిగిపోతూ ఉంటే, చెడ్డ మనుషులు విచ్చలవిడిగా నలుదిక్కులా తిరుగాడుతారు.

కీర్తనలు — Chapters