Skip to content
Opens in a new window

[1] యెహోవా, నేను నిజాయితీతో బ్రతికేవాణ్ణి. నీ మీదే నమ్మకం ఉంచేవాణ్ణి. నాకు సందేహం అంటూ లేదు. గనుక నా పక్షాన న్యాయం జరిగించు.

[2] నన్ను పరీక్షించి చూడు, యెహోవా, నా హృదయాన్ని, మనసును పరిశోధించు.

[3] నీ అనుగ్రహం నా దృష్టిలో ఉంచుకొని నీ సత్యాన్ని అనుసరించి మెలిగేవాణ్ణి.

[4] అబద్ధికులతో నేను సహవాసం చేసేవాణ్ణి కాను. కపటులతో నాకేమీ పని ఉండదు.

[5] దుష్టులతో పొత్తు నాకసహ్యం. దుర్మార్గులతో కలిసి మెలసి ఉండను.

[6] యెహోవా, నేను నిరపరాధిని. నా చేతులు కడుక్కొని నీ బలిపీఠానికి ప్రదక్షిణం చేస్తాను.

[7] అక్కడ నీకు కృతజ్ఞతలు అర్పిస్తాను, నీ అద్భుతాలన్నిటినీ తెలియజేస్తాను.

[8] యెహోవా, నీవు నివసించే ఆలయం, నీ తేజస్సు ఉండే ఆ స్థలం అంటే నా కెంతో ప్రీతి.

[9] పాపాత్ములతో పాటు నన్ను తుడిచిపెట్టకు. హంతకులతో పాటు నా ప్రాణం తీయకు.

[10] వాళ్ళ చేతులతో చెడ్డ పనులు చేస్తారు. వాళ్ళ కుడి చేతినిండా లంచాలే!

[11] నేనైతే నిజాయితీతో బ్రతుకుతున్నాను. నన్ను విమోచించు, కరుణతో చూడు.

[12] సమతలం మీద అడుగుపెట్టాను. ప్రజల సమావేశాలలో యెహోవాను స్తుతిస్తాను.

కీర్తనలు — Chapters