Skip to content
Opens in a new window

[1] ఇస్రాయేల్‌ప్రజ ఈ విధంగా చెప్పాలి: “మనుషులు మనమీదికి ఎగబడ్డప్పుడు యెహోవా మనకు తోడుగా ఉండకపోతే,

[2] వాళ్ళ కోపాగ్ని మనమీద రగిలినప్పుడు యెహోవా మనకు తోడుగా ఉండకపోతే,

[3] వాళ్ళు మనల్ని ప్రాణాలతోనే దిగమింగి ఉండేవాళ్ళు,

[4] నీళ్ళు మనల్ని ముంచివేసి ఉండేవి, ప్రవాహం మన ప్రాణం మీదుగా పొర్లి పారి ఉండేది,

[5] ప్రవహిస్తూ ఘోషించే జలాలు మన ప్రాణంమీదుగా పొర్లిపారి ఉండేవి.”

[6] వాళ్ళ పళ్ళకు మనల్ని వేటమాంసంగా యెహోవా అప్పగించలేదు. ఆయన స్తుతికి పాత్రుడు.

[7] మన ప్రాణం పక్షిలాగా వేటకాండ్ల ఉరినుంచి తప్పించుకొంది. ఉరి తెగిపోయింది. మనం తప్పించుకొన్నాం.

[8] ఆకాశాలనూ భూమినీ సృజించిన యెహోవా పేరు మూలంగానే మనకు సహాయం లభిస్తూ ఉంది.

కీర్తనలు — Chapters