Skip to content
Opens in a new window

[1] దేవుడు బలాఢ్యుల సమాజంలో నిలబడి ఉన్నాడు. ఆయన దేవుళ్ళ మధ్య తీర్పు తీర్చేవాడు.

[2] “ఎన్నాళ్ళు మీరు అన్యాయంగా తీర్పు తీరుస్తారు? దుర్మార్గులంటే మీకెంతవరకు ఈ పక్షపాతం?

[3] బీదసాదలకు, అనాథలకు న్యాయం చేకూర్చండి. దీనదశలో, అక్కరలో ఉన్నవారికి న్యాయం జరిగేలా చూడండి.

[4] బీదవారికీ, దరిద్రులకు విడుదల కలిగించండి. దుర్మార్గుల చేతిలోనుంచి వారిని తప్పించండి.

[5] వాళ్ళకు తెలివి లేదు. వాళ్ళకేమీ అర్థం కాదు. వాళ్ళు చీకట్లో అటు ఇటు తిరుగులాడుతారు. లోకం పునాదులన్నీ కంపించి ఉన్నాయి.

[6] మీరు “దేవుళ్ళు” అనీ, మీరంతా సర్వాతీతుడి కుమారులనీ నేను గదా చెప్పాను?

[7] అయినా, ఇతరుల్లాగే మీరూ చనిపోతారు. ఇతర అధికారులు కుప్పకూలినట్లే మీకూ జరుగుతుంది.

[8] దేవా, లేచి భూమికి తీర్పు తీర్చు. జనాలన్నీ నీ సొత్తు.

కీర్తనలు — Chapters