[1] యెహోవాను స్తుతించండి! ఆయన పవిత్రాలయంలో దేవుణ్ణి స్తుతించండి! ఆయన బలప్రభావాలను ప్రదర్శించే విశాలాకాశంలో ఆయనను స్తుతించండి!
[2] ఆయన బలమైన క్రియాకలాపాలను బట్టి ఆయనను స్తుతించండి! ఆయన మహా గొప్పతనాన్ని బట్టి ఆయనను స్తుతించండి!
[3] బూరలు ఊదుతూ ఆయనను స్తుతించండి! తంతివాద్యాలు వాయిస్తూ ఆయనను స్తుతించండి!
[4] కంజరితో, నాట్యంతో ఆయనను స్తుతించండి! తంతి వాద్యం మీటుతూ, పిల్లనగ్రోవి మోగిస్తూ ఆయనను స్తుతించండి!
[5] తాళాలు మోగిస్తూ, పెద్ద శబ్దం చేసే తాళాలు వాయిస్తూ, ఆయనను స్తుతించండి!
[6] ఊపిరి ఉన్న ప్రతిదీ, ప్రతి ఒక్కరూ యెహోవాను స్తుతించాలి. యెహోవాను స్తుతించండి!
కీర్తనలు — Chapters
123456789101112131415161718192021222324252627282930313233343536373839404142434445464748495051525354555657585960616263646566676869707172737475767778798081828384858687888990919293949596979899100101102103104105106107108109110111112113114115116117118119120121122123124125126127128129130131132133134135136137138139140141142143144145146147148149150