Skip to content
Opens in a new window

[1] దేవా, నా మొర ఆలకించు. నా ప్రార్థన విను.

[2] నా హృదయం క్రుంగిపోయినప్పుడు భూమి అంచునుంచి నీకు ఆక్రందన చేస్తాను. నాకంటే ఎత్తుగా ఉన్న బండమీదికి నన్ను ఎక్కించు.

[3] నీవే నాకు ఆశ్రయంగా ఉన్నావు, శత్రువుల ఎదుట బలమైన కోటలాంటివాడవు.

[4] యుగాల తరబడి నీ నివాసంలో నేనుంటాను. నీ రెక్కల చాటున నేను ఆశ్రయిస్తాను. (సెలా)

[5] దేవా, నేను చేసిన శపథాలను నీవు విన్నావు. నీ పేరంటే భయభక్తులు గలవారి వారసత్వంలో నన్ను పాలిభాగస్తుణ్ణి చేశావు.

[6] రాజు జీవిత కాలాన్ని నీవు పొడిగిస్తావు. రాజు తరతరాలుగా ఉంటాడు.

[7] దేవుని సమక్షంలో అతడు శాశ్వతంగా ఉంటాడు. అనుగ్రహం, సత్యం అతనికి రక్షకంగా నియమించు.

[8] నేను ఎల్లప్పుడూ నీ పేరును సంకీర్తనం చేస్తాను. ప్రతిరోజూ నేను మ్రొక్కుకొన్నది నీకు సమర్పించుకొంటాను.

కీర్తనలు — Chapters