Skip to content
Opens in a new window

[1] దేవా, నీవే నా దేవుడు. మనసారా నేను నిన్ను వెదుకుతాను. నా అంతరంగం నీకోసం దప్పిగొంటూ ఉంది. నా శరీరం నీకోసం తహతహలాడుతూ ఉంది. ఎండిపోయి ఆయాసం కలిగించే భూమి, నీరు లేని ప్రదేశమిది.

[2] నీ పవిత్రాలయంలో నేను నిన్ను చూచినట్టు, నీ బల ప్రభావాలను, నీ వైభవాన్ని చూడాలని ఎంతో ఆశిస్తున్నాను.

[3] నీ అనుగ్రహం జీవితంకంటే శ్రేష్ఠం. నాపెదవులు నిన్ను కీర్తిస్తాయి.

[4] నేను బ్రతికినన్నాళ్ళు నిన్ను స్తుతిస్తాను. నీ పేర నేను చేతులు పైకెత్తుతాను.

[5] నా అంతరంగంలో నాకెంతో తృప్తి కలుగుతుంది. కొవ్వు, మూలుగ భుజించినట్టుంది నాకు. నా పెదవులు ఆనంద ధ్వనులు చేస్తాయి. నా నోరు నిన్ను కీర్తిస్తుంది.

[6] నేను పడకపై పడుకొని నిన్ను జ్ఞాపకం చేసుకొన్నప్పుడు రాత్రి జాములలో నీ మీదే ధ్యానం చేస్తాను.

[7] నాకు సహాయం చేసినవాడివి నీవే. నీ రెక్కల నీడలో నేను ఆనందంతో పాడుతాను.

[8] నా అంతరంగం నిన్నే అనుసరిస్తూ అంటిపెట్టుకొని ఉంది. నీ కుడి చెయ్యి నాకు ఆధారం ఇస్తూ ఉంది.

[9] నా ప్రాణం తీయాలని అవకాశాలు వెదుకుతున్న వాళ్ళు భూమి అగాధాలకు దిగిపోతారు.

[10] వాళ్ళు కత్తిపాలై కూలుతారు. వాళ్ళ గతి నక్కలపాలే.

[11] రాజునైన నేను దేవునిమూలంగా సంతోషిస్తాను. ఆయనమీద ప్రమాణం చేసేవాళ్ళందరికీ ఎంతో అతిశయం కలుగుతుంది. అబద్ధాలాడేవాళ్ళ నోరు దేవుడు నొక్కివేస్తాడు.

కీర్తనలు — Chapters