Skip to content
Opens in a new window

[1] నా దీనావస్థలో నేను యెహోవాకు మొరపెట్టాను. ఆయన నాకు జవాబిచ్చాడు.

[2] యెహోవా, అబద్ధాలు పలికే పెదవుల నుంచి, మోసం చేసే నాలుక నుంచి నన్ను కాపాడు.

[3] మోసం చేసే నాలుకా, ఆయన నీకేం చేస్తాడో తెలుసా? ఇక నీకేం జరిగిస్తాడో తెలుసా?

[4] ఆయన బాణాలు తంగేడు నిప్పుల్లాంటివి. అవి బలాఢ్యుడు ఎక్కుపెట్టే పదునైన బాణాలు. అవే నీ మీదికి వేస్తాడాయన.

[5] అయ్యో, నేను మెషెక్‌జనం మధ్య పరదేశిని. నా కాపురం కేదార్‌వాళ్ళ డేరాల దగ్గర,

[6] శాంతి అంటే గిట్టనివాళ్ళ దగ్గర నేను చాలా కాలంనుంచి నివాసం ఉన్నాను.

[7] నాకు కావలసినది శాంతి! అయినా, నా నోట మాట వచ్చిందంటే, వాళ్ళు యుద్ధానికి సిద్ధమవుతారు.

కీర్తనలు — Chapters