Skip to content
Opens in a new window

[1] సర్వలోక ప్రజలారా, చప్పట్లు కొట్టండి. గొంతెత్తి దేవునికి ఆనంద ధ్వనులు చెయ్యండి.

[2] యెహోవా సర్వాతీతుడు, భయభక్తులకు పాత్రుడు. లోకమంతటి మీదా ఆయన గొప్ప రాజు.

[3] ఇతర ప్రజలను మన వశం చేస్తాడు. జనాలను మన పాదాల కింద అణచివేస్తాడు.

[4] మన వారసత్వాన్ని ఆయన మనకు పంచి ఇస్తాడు. ఆయనకు ప్రియమైన యాకోబు ప్రజల దివ్యమైన వారసత్వమది. (సెలా)

[5] దేవుడు జయధ్వనులతో పైకి వెళ్ళాడు. బూర మోగుతూ ఉంటే యెహోవా పైకి ఎక్కిపొయ్యాడు.

[6] స్తుతి పాటలు పాడండి, దేవునికి స్తుతి పాటలు పాడండి. సంకీర్తనం చేయండి. మన రాజుకు సంకీర్తనం చేయండి.

[7] లోకమంతటికీ రాజు దేవుడే. కీర్తన పాడండి.

[8] దేవుడు తన పవిత్ర సింహాసనం మీద కూర్చుని ఉన్నాడు. దేవుడు లోక ప్రజలను పరిపాలిస్తున్నాడు.

[9] ఇతర ప్రజల ఘనులు అబ్రాహాము యొక్క దేవుని ప్రజతో సమకూడి ఉన్నారు. ఇహలోకంలోని డాళ్ళు దేవునివి. ఉన్నత స్థానం ఆయనదే.

కీర్తనలు — Chapters