Skip to content
Opens in a new window

[1] యెహోవాను స్తుతించండి! యెహోవా సేవకులారా, ఆయనను స్తుతించండి. యెహోవా పేరును స్తుతించండి!

[2] ఇప్పటినుంచి ఎప్పటెప్పటికీ యెహోవా పేరును కీర్తించడం జరుగుతుంది గాక!

[3] పొద్దు పొడిచినది మొదలుకొని క్రుంకే స్థలం వరకు యెహోవా పేరును స్తుతించడం యోగ్యం.

[4] యెహోవా జనాలన్నిటికీ ఎంతో అతీతంగా ఉన్నాడు. ఆయన మహత్వం ఆకాశాలకు పైగా ఉంది.

[5] మన దేవుడైన యెహోవాకు ఎవరు సాటి? ఆయన ఉన్నత స్థానంలో సింహాసనాసీనుడు.

[6] ఆయన ఆకాశాలనూ భూమినీ వంగి చూస్తున్నాడు.

[7] నేలమట్టినుంచి బీదలను పైకెత్తుతాడాయన. బూడిద కుప్పమీదనుంచి అక్కరగలవారిని లేవనెత్తుతాడు.

[8] వారిని అధిపతులలో తన ప్రజానాయకులలో సమానంగా పైన కూర్చోబెడతాడు.

[9] ఇంట్లో ఉన్న గొడ్రాలికి సంతానం ప్రసాదించి, ఆమెను ఆనందించే తల్లిగా చేస్తాడు. యెహోవాను స్తుతించండి!

కీర్తనలు — Chapters