Skip to content
Opens in a new window
Listen to this chapter • 0:53

[1] యెహోవా పరిపాలన చేస్తున్నాడు. ప్రభావం ధరించుకున్నాడు. యెహోవా బలం ధరించాడు, బలాన్ని నడికట్టుగా కట్టుకున్నాడు. లోకం సుస్థిరంగా ఉంది, అది కదలదు.

[2] ప్రాచీన కాలంనుంచి నీ సింహాసనం సుస్థిరంగా ఉంది. నువ్వు శాశ్వతకాలం ఉన్నావు.

[3] యెహోవా, మహా సముద్రాలు పైకి లేచాయి, అవి తమ గొంతెత్తాయి, మహా సముద్రాల అలలు ఎగిసిపడి హోరెత్తుతున్నాయి.

[4] అనేక అలల ఘోషకు మించి, బలమైన సముద్ర తరంగాలను మించి, పైనున్న యెహోవా శక్తిశాలి.

[5] యెహోవా, నీ శాసనాలు నమ్మదగినవి, పరిశుద్ధత నీ ఇంటికి శాశ్వత అలంకారంగా ఉంది.

కీర్తనలు — Chapters