Skip to content
Opens in a new window
Listen to this chapter • 0:37

[1] చూడండి, సోదరులు ఐక్యంగా కలసి ఉండడం ఎంత మంచిది! ఎంత రమ్యమైనది!

[2] అది ఆహరోను తలమీద పోసిన పరిమళ తైలం వంటిది. అది అహరోను గడ్డం నుండి అతడి అంగీ అంచులదాకా కారుతూ ఉన్న పరిమళ తైలం వంటిది.

[3] అది సీయోను కొండల మీదికి దిగి వచ్చే హెర్మోను పర్వతం మంచులాంటిది. అక్కడ ఆశీర్వాదం ఉంటుందనీ అది శాశ్వతంగా నిలిచి ఉండే జీవమనీ యెహోవా సెలవిచ్చాడు.

కీర్తనలు — Chapters