Skip to content
Opens in a new window
Listen to this chapter • 0:56

[1] ఈజిప్టులోనుండి ఇశ్రాయేలు, విదేశీ జాతుల్లోనుండి యాకోబు వెళ్లిపోయినప్పుడు,

[2] యూదా ఆయనకు పరిశుద్ధస్థలం అయింది. ఇశ్రాయేలు ఆయనకు రాజ్యం అయింది.

[3] సముద్రం దాన్ని చూసి పారిపోయింది. యొర్దాను నది వెనక్కి మళ్ళింది.

[4] పర్వతాలు పొట్టేళ్లలాగా, కొండలు గొర్రెపిల్లల్లాగా గంతులు వేశాయి.

[5] ఓ సముద్రం, పారిపోయావేమిటి? యొర్దానూ, నీవు వెనక్కి మళ్లావేమిటి?

[6] పర్వతాల్లారా, మీరు పొట్లేళ్లలాగానూ కొండల్లారా, మీరు గొర్రెపిల్లల్లాగానూ కుప్పిగంతులు వేశారెందుకు?

[7] భూమీ, ప్రభువు సన్నిధిలో, యాకోబు దేవుని సన్నిధిలో వణకు.

[8] ఆయన బండరాతిని నీటిమడుగుగా, చెకుముకి రాతి శిలను నీటి ఊటలుగా చేశాడు.

కీర్తనలు — Chapters