Skip to content
Opens in a new window
Listen to this chapter • 1:16

[1] జాతులన్నీ చప్పట్లు కొట్టండి. విజయోత్సాహంతో ఆనంద ధ్వనులు చేయండి.

[2] అత్యున్నతుడైన యెహోవా భయంకరమైనవాడు. భూమి అంతటికీ ఆయన మహారాజు.

[3] ఆయన జాతులను మనకు లోబరుస్తాడు. దేశాలను మన కాళ్ళ కిందకు తీసుకువస్తాడు.

[4] మన వారసత్వాన్ని ఎంపిక చేస్తాడు. అది తాను ప్రేమించిన యాకోబు కీర్తి ప్రతిష్టల వారసత్వం.

[5] దేవుడు గొప్ప ధ్వనితో ఆరోహణం అయ్యాడు. బాకా శబ్దంతో యెహోవా ఆరోహణం అయ్యాడు.

[6] దేవునికి స్తుతులు పాడండి. స్తుతించండి. మన రాజుకు స్తుతులు పాడండి, స్తుతులు పాడండి.

[7] ఎందుకంటే మన దేవుడు భూమి అంతటికీ రాజు. అవగాహనతో స్తుతులు పాడండి.

[8] దేవుడు అన్ని జాతులల పైనా పరిపాలన చేస్తున్నాడు. ఆయన తన పవిత్ర సింహాసనంపై కూర్చుని ఉన్నాడు.

[9] జాతుల అధిపతులు అబ్రాహము దేవుని ప్రజలతో కూడి ఉన్నారు. భూమిపై రక్షణ డాళ్ళు దేవునికే చెందుతాయి. భూమిపై అత్యున్నత స్థానం ఆయనదే.

కీర్తనలు — Chapters