Skip to content
Opens in a new window
Listen to this chapter • 1:07

[1] ఇశ్రాయేలు ఇలా చెప్పాలి. నా యవ్వన ప్రాయం నుంచి శత్రువులు నాపై దాడి చేశారు.

[2] నా బాల్యం నుండి నాపై యుద్ధం చేస్తూ వచ్చారు. అయినా వాళ్ళు నన్ను ఓడించలేకపోయారు.

[3] భూమిని దున్నినట్టు వాళ్ళు నా వీపును దున్నారు. నాకు నాగటి చాళ్ళవంటి గాయాలు చేశారు.

[4] యెహోవా న్యాయవంతుడు. దుర్మార్గుల తాళ్ళను ఆయన తెంపివేశాడు.

[5] సీయోనును ద్వేషించే వాళ్ళంతా సిగ్గుపడి, వెనుకడుగు వేస్తారు గాక.

[6] వాళ్ళు ఇంటికప్పుపై మొలకెత్తే గడ్డిమొక్కలవలె ఉంటారు గాక. అవి ఎదిగీ ఎదగక ముందే వాడిపోతాయి.

[7] కోసేవాడి గుప్పిలిలోకైనా ఆ గడ్డి చాలదు. పనలు కట్టేవాడు దానితో తన ఒడిని నింపుకోడానికి అది చాలదు.

[8] ఆ దారిన పోయే వాళ్ళు, యెహోవా దీవెన మీపై ఉండు గాక, యెహోవా నామంలో మిమ్మల్ని దీవిస్తున్నాము అనరు గాక.

కీర్తనలు — Chapters