Listen to this chapter • 1:00
[1] దేవా, నీ నామాన్నిబట్టి నన్ను రక్షించు. నీ వీరత్వాన్ని బట్టి నాకు న్యాయం తీర్చు.
[2] దేవా, నా ప్రార్థన ఆలకించు. నా నోటి మాటలు నీకు వినబడనియ్యి.
[3] గర్వికులు నాకు వ్యతిరేకంగా లేచారు. జాలిలేని వారు నా ప్రాణం తీయాలని చూస్తున్నారు. వారికి దేవుడంటే లెక్కలేదు.
[4] ఇదిగో, దేవుడే నా సహాయం. ప్రభువే నా ప్రాణాన్ని నిలబెట్టేవాడు.
[5] నా శత్రువులు చేసే కీడును ఆయన వారి మీదకే రప్పిస్తాడు. నీ నమ్మకత్వాన్ని బట్టి వారిని నాశనం చెయ్యి.
[6] సేచ్చార్పణ బలులు నేను నీకు అర్పిస్తాను. యెహోవా, నీ నామం ఉత్తమం. నేను దానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను.
[7] ప్రతి ఆపద నుండి ఆయన నన్ను విడిపించాడు. నా శత్రువుల ఓటమిని నా కన్ను సంతోషంగా చూస్తున్నది.
కీర్తనలు — Chapters
10:5721:4431:0641:2652:0261:3072:5581:2093:03103:01111:17121:25131:09141:16150:57161:45172:45187:41192:23201:20212:06224:54231:01241:31253:05261:35272:39281:40291:36301:50314:06322:00333:12343:11354:53361:54375:47383:02392:28403:24412:03422:26431:08444:00453:08461:41471:16482:06493:07503:26513:00521:30531:12541:00553:32561:58572:03581:45592:42601:48611:06622:08631:30641:43652:19662:47670:59685:43695:26700:50713:35723:08733:31743:21751:32761:38772:34789:59792:03802:33812:33821:07832:32842:07851:48862:34870:56882:33897:00902:32912:13921:54930:53942:48951:29961:56971:49981:20991:291000:491011:271023:181032:581044:501055:241066:001075:241081:451094:281101:081111:251121:211131:051140:561151:531162:051170:241183:3011922:481200:571210:571221:111230:431240:591250:541260:541270:551280:561291:071301:051310:341322:221330:371340:271352:571363:241371:281381:341393:281402:001411:461421:201432:111442:331452:501461:341472:571482:171491:301501:03