Skip to content
Opens in a new window
Listen to this chapter • 1:05

[1] యెహోవా, లోతైన లోయలో ఉండి నేను నిన్ను ప్రాధేయపడుతున్నాను.

[2] ప్రభూ, నా ప్రార్థన అంగీకరించు. నేను చేసే ఆర్తనాదం శ్రద్ధగా ఆలకించు.

[3] యెహోవా, నువ్వు మా పాపాలను కనిపెట్టి చూసినప్పుడు నీ ఎదుట ఎవ్వరూ నిలవలేరు.

[4] అయినప్పటికీ నువ్వు వాళ్ళను క్షమిస్తున్నావు. నీ పట్ల భయభక్తులు కలిగి జీవించేలా చేస్తున్నావు.

[5] యెహోవా కోసం నేను ఎదురు చూస్తున్నాను. నా ప్రాణం ఎదురు చూస్తుంది. ఆయన మాటపైనే ఆశ పెట్టుకున్నాను.

[6] రాత్రి కాపలాదారులు ఉదయం కోసం ఎలా ఎదురు చూస్తారో అంతకంటే ఎక్కువగా నా ప్రాణం ప్రభువు కోసం ఎదురు చూస్తూ ఉంది.

[7] యెహోవా జాలిపరుడు. ఇశ్రాయేలూ, యెహోవా మీద ఆశలు నిలుపుకో. ఆయన క్షమించడానికి ఇష్టపడే వాడు.

[8] ఇశ్రాయేలువారి పాపాలన్నిటి నుండి విముక్తి కలిగించేది ఆయనే.

కీర్తనలు — Chapters