Skip to content
Opens in a new window
Listen to this chapter • 0:54

[1] యెహోవా మీద నమ్మకం ఉంచేవాళ్ళు సీయోను పర్వతంలాగా నిశ్చలంగా శాశ్వతంగా నిలిచి ఉంటారు.

[2] యెరూషలేము చుట్టూ పర్వతాలు ఉన్నట్టు ఇప్పటినుండి యెహోవా తన ప్రజల చుట్టూ నిరంతరం ఉంటాడు.

[3] నీతిమంతులు పాపం చేయకుండా ఉండేలా నీతిమంతుల వారసత్వంపై దుష్టుల రాజదండం పెత్తనం చెయ్యదు.

[4] యెహోవా, మంచివారికి మంచి జరిగించు. యథార్థహృదయం గలవారికి శుభం కలిగించు.

[5] తమ కుటిల మార్గాలకు తొలగిపోయిన వాళ్ళ విషయానికొస్తే ఆయన పాపం చేసేవాళ్ళను పారదోలేటప్పుడు వారిని దుర్మార్గులతో సహా వెళ్ళగొడతాడు. ఇశ్రాయేలు మీద శాంతి సమాధానాలు ఉండు గాక.

కీర్తనలు — Chapters