[1] ఆ రోజున యూదాదేశంలో ప్రజలు ఈ పాట పాడుతారు: బలమైన నగరమొకటి మనకు ఉంది. దేవుడు రక్షణను దానికి గోడలుగా, బురుజులుగా చేశాడు.
[2] న్యాయాన్ని అనుసరించే నమ్మకమైన ప్రజ లోపలికి వచ్చేలా దాని ద్వారాల తలుపులను తెరవండి.
[3] ఎవరి మనసు నీ మీద ఆనుకొంటుందో వారు ఎడతెగని శాంతి సమాధానాలు అనుభవిస్తూ ఎందుకంటే వారు నీమీద నమ్మకం ఉంచుతూ ఉన్నారు.
[4] యెహోవా తానే శాశ్వతమైన ఆధారశిల! గనుక యెహోవామీద ఎప్పటికీ నమ్మకం ఉంచుతూ ఉండండి.
[5] ఉన్నత స్థానంలో ఉంటున్న వాళ్ళను యెహోవా అణచివేసేవాడు, ఎత్తయిన పట్టణాన్ని పడగొట్టేవాడు, దానిని నేలమట్టం చేస్తాడు, దుమ్ముపాలు చేస్తాడు.
[6] కాళ్ళు – బీదలకాళ్ళు, దీనుల కాళ్ళు – దానిని త్రొక్కివేస్తున్నాయి.
[7] న్యాయవంతుల మార్గం తిన్నగా ఉంది. నిజాయితీపరుడా, నీవు న్యాయవంతుల దారిని సరాళం చేస్తావు.
[8] యెహోవా, మేము నీ న్యాయ నిర్ణయాలను అనుసరిస్తూ, నీకోసం చూస్తూ ఉన్నాం. నీ పేరు, నీ స్మరణ అంటే మాకు ప్రాణం.
[9] రాత్రివేళ నీవు కావాలని నా ప్రాణం తహతహలాడుతూ ఉంది. నాలో ఉన్న ఆత్మ నీ కోసం ఆసక్తితో వెదకుతూ ఉంది. నీ తీర్పులు లోకానికి వచ్చేటప్పుడు లోక ప్రజలు న్యాయం అంటే ఏమిటో
[10] దుర్మార్గులకు దయ చూపితే వాళ్ళు న్యాయాన్ని నేర్చుకోరు. నిజాయితీని అనుసరించే ప్రాంతంలో వాళ్ళు కాపురముంటూ ఉన్నా అన్యాయంగా యెహోవా మహత్తును ఆలోచించకుండా ఉంటారు.
[11] యెహోవా, నీ చెయ్యి ఎత్తావు గాని, వాళ్ళు దానిని చూడరు. వాళ్ళు నీ ప్రజలకోసం నీ ఆసక్తిని చూచి సిగ్గుపాలయ్యేలా చెయ్యి. నీ శత్రువులకోసం తయారైన అగ్ని వాళ్ళను నాశనం చేస్తుంది.
[12] యెహోవా, నీవు మాకు శాంతి ప్రసాదిస్తావు. నిజంగా మేము సాధించిన కృత్యాలన్నిటినీ నీవే సాధించావు.
[13] యెహోవా, మా దేవా, నీవు గాక వేరే ప్రభువులు మమ్మల్ని పరిపాలించేవారు గాని, నిన్నే, నీ పేరునే ప్రస్తుతిస్తాం.
[14] వాళ్ళు చనిపోయారు, ఇంకా బ్రతకరు. పోయినవాళ్ళ ఆత్మలు పైకి రావు. నీవు వాళ్ళను దండించి నాశనం చేశావు. వాళ్ళను గురించిన జ్ఞాపకాన్ని కూడా తుడిచివేశావు.
[15] యెహోవా, ఈ ప్రజను వృద్ధి చేశావు, ప్రజను వృద్ధి చేసి, దేశం సరిహద్దులను విశాలం చేసి, నీకు నీవే గౌరవాన్ని చేకూర్చుకొన్నావు.
[16] యెహోవా, బాధలో వారు నిన్ను సమీపించారు. నీవు వారిని శిక్షకు గురి చేశావు. వారు మెల్లగానే ప్రార్థన చేయగలిగారు.
[17] గర్భవతికి కానుపు వచ్చేటప్పుడు ఆమె అల్లాడిపోతూ నొప్పులతో అరచేవిధంగా
[18] మేము గర్భంతో ఉన్నట్టు వేదనలతో అల్లాడిపొయ్యాం. అయితే గాలిని మాత్రమే కన్నట్టు ఉన్నాం. మాచేత లోకానికి రక్షణ కలగలేదు, లోకంలో జనాలు పుట్టలేదు.
[19] చనిపోయిన నీవారు బ్రతుకుతారు. వారి మృతదేహాలు సజీవంగా లేస్తాయి. మట్టిలో పడి ఉన్న వారలారా! మేల్కొని ఆనంద ధ్వనులు చేయండి. మీ మంచు ఉదయ కాంతిలో కనబడే మంచు. భూమి చనిపోయినవారిని కంటుంది.
[20] నా ప్రజలారా! ఇడుగో, యెహోవా తన నివాసంలోనుంచి రాబోతున్నాడు. ఆయన లోక ప్రజలను వాళ్ళ అపరాధాల కారణంగా శిక్షిస్తాడు. భూమి తనమీద జరిగిన రక్తపాతాన్ని బయలుపరచి, హతమైన తనవాళ్ళను ఇంకా కప్పివేయదు.
[21] నా ప్రజలారా, మీరు మీ గదులలోకి వెళ్ళి తలుపులు మూసివేసుకోండి! ఆగ్రహం తీరిపోయేవరకు కొంచెం సేపు దాక్కోండి.