[1] ఆ రోజున మీరు ఇలా అంటారు: “యెహోవా! నీవు నామీద కోపపడ్డా, నీ కోపం చల్లారింది. నీవు నన్ను ఆదరించావు, గనుక నిన్ను స్తుతిస్తాను.
[2] ఇదిగో వినండి, నా రక్షణ దేవుడే. నేను ఆయనను నమ్ముకొంటున్నాను. భయపడను. యెహోవా, యెహోవా తానే నా బలం, నా గానం. ఆయనే నాకు రక్షణ అయ్యాడు.”
[3] మీరు రక్షణ బావులలోనుంచి ఆనందంతో నీళ్ళు చేదుకొంటారు.
[4] ఆ రోజున మీరు ఇలా అంటారు: “యెహోవాకు కృతజ్ఞత అర్పించండి. ఆయన పేర ప్రార్థన చేయండి. ఆయన చేసినది జనాలలో తెలియజేయండి. ఆయన పేరు ఘనమైనదని జ్ఞాపకం చేయండి.
[5] యెహోవాకు పాటలు పాడండి. ఆయన గొప్ప కార్యాలు చేశాడు. ఇది లోకం అంతటికీ తెలియాలి.
[6] సీయోను నివాసీ! ఆనందధ్వనులు బిగ్గరగా చేయి. మీ మధ్య ఉన్న ఇస్రాయేల్‌ప్రజల పవిత్రుడు మహా ఘనుడు.”