[1] యెహోవా, నూతన అద్బుత క్రియలు చేశాడు గనుక ఆయనకు ఒక కొత్త కీర్తన పాడండి. ఆయన పవిత్ర కుడి హస్తం ఆయనకు విజయం తెచ్చింది.
[2] యెహోవా రక్షించగల తన శక్తిని రాజ్యాలకు చూపెట్టాడు. యెహోవా తన నీతిని వారికి చూపించాడు.
[3] ఇశ్రాయేలీయుల యెడల ఆయన తన దయను, నమ్మకమును జ్ఞాపకముంచుకొన్నాడు. రక్షించగల మన దేవుని శక్తిని దూరదేశాల ప్రజలు చూసారు.
[4] భూమి మీది ప్రతి జనము యెహోవాకు ఆనంద ధ్వని చేయండి. త్వరగా స్తుతి కీర్తనలు పాడటం ప్రారంభించండి.
[5] స్వరమండలములారా, యెహోవాను స్తుతించండి. స్వరమండలసంగీతమా, ఆయనను స్తుతించుము.
[6] బూరలు, కొమ్ములు ఊదండి. మన రాజైన యెహోవాకు ఆనంద ధ్వని చేయండి.
[7] భూమి, సముద్రం, వాటిలో ఉన్న సమస్త జీవుల్లారా బిగ్గరగా పాడండి.
[8] నదులారా చప్పట్లు కొట్టండి. పర్వతములారా ఇప్పుడు మీరంతా కలిసి గట్టిగా పాడండి.
[9] యెహోవా ప్రపంచాన్ని పాలించుటకు వస్తున్నాడు గనుక ఆయన ఎదుట పాడండి. ఆయన ప్రపంచాన్ని న్యాయంగా పాలిస్తాడు. నీతితో ఆయన ప్రజలను పాలిస్తాడు.