Skip to content
Opens in a new window

[1] “మనం యెహోవా ఆలయానికి వెళ్దాం” అని ప్రజలు నాతో చెప్పినప్పుడు నేను చాలా సంతోషించాను.

[2] ఇక్కడ యెరూషలేము ద్వారాల దగ్గర మనం నిలిచిఉన్నాము.

[3] కొత్త యెరూషలేము ఒకే ఐక్యపట్టణంగా మరల కట్టబడింది.

[4] దేవునికి చెందిన గోత్రాల వారు అక్కడికి వెళ్తారు. యెహోవా నామాన్ని స్తుతించుటకు ఇశ్రాయేలు ప్రజలు అక్కడికి వెళ్తారు.

[5] ప్రజలకు న్యాయం తీర్చడానికి, రాజులు వారి సింహాసనాలు వేసుకొనే స్థలం అది. దావీదు వంశపు రాజులు వారి సింహాసనాలు అక్కడే వేసుకొన్నారు.

[6] యెరూషలేములో శాంతి కోసం ప్రార్థించండి. “నిన్ను ప్రేమించే ప్రజలకు అక్కడ శాంతి లభిస్తుందని నేను ఆశిస్తున్నాను.

[7] నీ ప్రాంగణాలలో శాంతి ఉంటుందని నేను ఆశిస్తున్నాను. నీ మహాభవనాల్లో భద్రత ఉంటుందని నేను ఆశిస్తున్నాను.”

[8] నా పొరుగువారు, ఇతర ఇశ్రాయేలీయులు క్షేమంగాను, శాంతితోను ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను.

[9] మన యెహోవా దేవుని ఆలయక్షేమం కోసం ఈ పట్టణానికి మంచి సంఘటనలు సంభవించాలని నేను ప్రార్థిస్తున్నాను.

కీర్తనల గ్రంథము — Chapters