Skip to content
Opens in a new window

[1] యెహోవా, నేను గొప్ప కష్టంలో ఉన్నాను. కనుక సహాయం కోసం నిన్ను పిలుస్తున్నాను.

[2] నా ప్రభువా, నా మాట వినుము. సహాయం కోసం నేను చేస్తున్న మొర వినుము.

[3] యెహోవా, మనుష్యులను వారి పాపాలన్నిటి బట్టి నీవు శిక్షిస్తే ఒక్క మనిషి కూడా మిగలడు.

[4] యెహోవా, నీ ప్రజలను క్షమించుము. అప్పుడు నిన్ను ఆరాధించుటకు మనుష్యులు ఉంటారు.

[5] యెహోవా నాకు సహాయం చేయాలని నేను కనిపెడుతున్నాను. నా ఆత్మ ఆయన కోసం కనిపెడుతుంది. యెహోవా చెప్పేది నేను నమ్ముతున్నాను.

[6] నా ప్రభువు కోసం నేను కనిపెడుతున్నాను. ఎప్పుడు తెల్లారుతుందా అని ఆశతో కనిపెడుతున్న కావలివాండ్లలా నేను ఉన్నాను.

[7] ఇశ్రాయేలూ, యెహోవాను నమ్ముకో. నిజమైన ప్రేమ యెహోవా దగ్గర మాత్రమే కనబడుతుంది. యెహోవా మనలను మరల, మరల రక్షిస్తాడు.

[8] మరియు యెహోవా ఇశ్రాయేలీయుల పాపాలు అన్నింటి విషయంలో వారిని క్షమిస్తాడు.

కీర్తనల గ్రంథము — Chapters